పోలవరం అఫిడవిట్​లో అన్నీ తప్పులే : సీడబ్ల్యూసీ, పీపీఏలకు తెలంగాణ లేఖ

పోలవరం అఫిడవిట్​లో అన్నీ తప్పులే : సీడబ్ల్యూసీ, పీపీఏలకు తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు :  పోలవరం బ్యాక్​వాటర్​తో తలెత్తే ముంపుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో అన్నీ తప్పులే ఉన్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముంపును తేల్చడానికి జాయింట్​సర్వే చేయాలన్న  సీడబ్ల్యూసీ ఆదేశాలను పీపీఏ పట్టించుకోకుండా ఈ అఫిడవిట్​ఫైల్​చేసిందని మండిపడింది.  సీడబ్ల్యూసీ, పీపీఏలకు మంగళవారం లెటర్  రాసింది.

పోలవరంతో తలెత్తే ముంపుపై 2022 అక్టోబర్​7న, ఈ ఏడాది జనవరి 25న, ఏప్రిల్​3న, 12న సమన్వయ కమిటీ సమావేశాల తర్వాత తీసుకున్న నిర్ణయాలేవి అమలు కాలేదని తెలంగాణ అధికారులు తెలిపారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏపీ ఇచ్చిన డేటా ప్రకారమే.. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని వెల్లడించారు.  ఈ డేటా ప్రకారం పీపీఏ వెంటనే ఫీల్డ్​సర్వే చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్​లోపాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.