మీకు తెలియకుండానే మీ పాన్‌‌‌‌‌‌‌‌ కార్డుతో లోన్లా ? .. అడ్డుకోండి ఇలా !

మీకు తెలియకుండానే మీ పాన్‌‌‌‌‌‌‌‌ కార్డుతో లోన్లా  ? .. అడ్డుకోండి ఇలా !
  • ఎప్పటికప్పుడు క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లను చెక్ చేసుకోవాలి
  • నకిలీ లోన్లు ఎవరైనా తీసుకుంటే క్రెడిట్ బ్యూరోలకు ఫిర్యాదు చేయాలి
  • సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేయాలి
  • సురక్షితం కాని వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లు, యాప్‌‌‌‌‌‌‌‌లు, లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌లలో పాన్ కార్డ్‌‌‌‌‌‌‌‌ షేర్ చేయొద్దు

న్యూఢిల్లీ: లోన్ మోసాలు పెరుగుతున్నాయి. మీకు తెలియకుండానే మీ పాన్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ మీద మోసగాళ్లు లోన్లు తీసుకుంటున్నారు. ఇటువంటి  కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, మీ పాన్ కార్డ్ ద్వారా ఎవరైనా అనుమతి లేకుండా లోన్ తీసుకున్నారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాన్ కార్డ్‌  క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌తో లింకై ఉంటుంది. దాని ద్వారా తీసుకున్న ఏదైనా లోన్  మీ క్రెడిట్ రేటింగ్,  రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పాన్ కార్డ్ దుర్వినియోగం కాకుండా నివారించడానికి ఈ కింది విధానాలను ఫాలో అవ్వాలి. 

క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి
క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను  ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం.  సిబిల్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్‌‌‌‌‌‌‌‌, ఈక్విఫాక్స్‌‌‌‌‌‌‌‌, క్రిఫ్‌‌‌‌‌‌‌‌ హై మార్క్‌‌‌‌‌‌‌‌  వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరుతో తీసుకున్న అన్ని లోన్లు,  క్రెడిట్ కార్డుల వివరాలను మేనేజ్ చేస్తాయి.  మీరు వాటి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లలోకి వెళ్లి  పాన్,  మొబైల్ నంబర్‌‌‌‌‌‌‌‌తో ధృవీకరణ చేసి, ఏడాదికి ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను పొందొచ్చు. 

క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో హెచ్చరిక సంకేతాలు
మీరు దరఖాస్తు చేయని లోన్లు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, తెలియని రుణదాతల పేర్లు, లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఇంక్వైరీలు వంటివి క్రెడిట్ రిపోర్ట్‌లో ఉండొచ్చు. వీటిని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండా తీసుకున్న లోన్లు ఉంటే  వెంటనే చర్యలు తీసుకోవాలి. 

మీకు తెలియకుండా లోన్లు తీసుకుంటే..
మీరు నకిలీ లోన్‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తే వెంటనే సంబంధిత ఫైనాన్షియల్ సంస్థకు  తెలియజేయాలి. రిపోర్ట్ చేసిన క్రెడిట్ బ్యూరో వద్ద ఇష్యూ రైజ్ చేయాలి.  చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోల వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దాఖలు చేయొచ్చు. గుర్తింపును తెలియజేసే డాక్యుమెంట్లు,  లోన్ వివరాలు, సంతకం చేసిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ను సమర్పించాలి. అదనంగా, స్థానిక పోలీస్ సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్ సెల్‌‌‌‌‌‌‌‌లో పాన్ దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదును దాఖలు చేసి, ఆధారాలను సమర్పించాలి.

మరిన్ని అంశాలు..
ఎవరైనా మీ పాన్‌‌‌‌‌‌‌‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించి లోన్ తీసుకుంటే  మీ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోతుంది. నిజమైన లోన్‌‌‌‌‌‌‌‌లను పొందడం కష్టంగా మారుతుంది.  ప్రతి 3–-6 నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను చెక్ చేసుకోవాలి. ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా రిపోర్ట్ పొందొచ్చు. క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో  మోసాన్ని ముందుగా గుర్తించొచ్చు,  నివారించొచ్చు.

భవిష్యత్తులో పాన్ దుర్వినియోగాన్ని నివారించడం
మీ పాన్ కార్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సురక్షితం కాని వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎప్పుడూ షేర్ చేయొద్దు. దాన్ని పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లేదా అనవసరంగా ఇతరులకు ఇవ్వొద్దు.   పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే, వెంటనే రీప్రింట్ కోసం దరఖాస్తు చేసి, రాబోయే కొన్ని నెలల్లో క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్ చేసుకోవాలి. ఆర్థిక ఖాతాలకు బలమైన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సెట్ చేయాలి.  పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుసంధానించిన లోన్ లేదా క్రెడిట్ దరఖాస్తుల కోసం ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఈమెయిల్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆన్ చేసుకోవాలి.