టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్

టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్.. ఆస్పత్రి బిల్లులకు భయపడి కోట్ల మంది ముందు జాగ్రత్తగా.. ఎలాంటి అనారోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం బాగోలేనప్పుడు అత్యవసరం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కడుతుంటారు.. కంపెనీలు సైతం ఇలాగే యాడ్స్ ఇస్తుంటాయి.. అనారోగ్యం ఏదైనా.. ఆస్పత్రిలో చేరితే చాలు క్లెయిమ్ చేసుకోవచ్చంటూ.. ప్రతి ఏటా వేలకు వేల రూపాయలను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టించుకుంటూ ఉంటాయి.. మాజీ జర్నలిస్ట్ ప్రీతి బోబే షేర్ చేసిన ఓ లింక్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తుంది.. చర్చనీయాంశం అయ్యింది.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన HDFC ERGOను తిట్టిపోస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాజీ జర్నలిస్ట్ ప్రీతి చోబేకు HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. 2024, ఏప్రిల్ 21వ తేదీన ఇంట్లోనే కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవటంతో.. HDFC ERGO క్లెయిమ్ వర్తించే.. మేదాంత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఐసీయూలో అడ్మిట్ చేశారు.. గుండె సంబంధిత చికిత్స అందించారు.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో.. HDFC ERGOకు రిఫర్ చేశారు. అయితే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వటానికి నిరాకరించింది. కారణం.. మాజీ జర్నలిస్ట్ ప్రీతి.. టెన్షన్.. ఆందోళన కారణంగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని.. టెన్షన్ కారణంగా అనారోగ్యానికి గురయితే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రీతి..

మాజీ జర్నలిస్ట్ ప్రీతి పోస్టు వైరల్ అయ్యింది.. 15 లక్షల మంది స్పందించారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీరును తప్పుబట్టారు.. తిట్టిపోశారు. టెన్షన్ కారణంగా అనారోగ్యానికి గురయితే క్లెయిమ్ ఇవ్వం అని ముందే చెప్పాలంటూ కంపెనీని టార్గెట్ చేశారు నెటిజన్లు.. ఇదే సమయంలో 2022, 2023 సంవత్సరాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో టాప్ 5 కంపెనీల్లో HDFC ERGO ఒకటి అని అవార్డులు కూడా ఇచ్చారు ఈ కంపెనీకి.. అలాంటి కంపెనీ టెన్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్స్ ఇవ్వం అని ఎలా చెబుతుంది అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..

తీవ్ర విమర్శలు రావటంతో HDFC ERGO స్పందించింది. ప్రీతికి ఇలా జరగటం బాధాకరం అని.. పాలసీ నెంబర్ ను వ్యక్తిగతంగా మా సిబ్బందికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. 

ఆధునిక కాలంలో..  టెన్షన్ లేని ఉద్యోగం ఉందా.. టెన్షన్ లేని వ్యాపారం ఉందా.. టెన్షన్ పడని కుటుంబం ఉందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.. సర్వరోగాలకు టెన్షన్ కారణం అని నిపుణులు చెబుతుంటే.. HDFC ERGO క్లెయిమ్ వర్తించని చెప్పటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగించాలా లేదా అని కూడా డిసైడ్ చేసుకుంటామని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు..