డ్రగ్స్ ర్యాకెట్ లో అంతా చంద్రబాబు బంధువులే: మాజీ మంత్రి పేర్నినాని

డ్రగ్స్ ర్యాకెట్ లో అంతా చంద్రబాబు బంధువులే: మాజీ మంత్రి పేర్నినాని

 విశాఖ డ్రగ్స్ కేసు పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు చంద్రబాబుబాబు బంధువులేనని ఆయన అన్నారు. వారివి బీరకాయ పీచు బంధుత్వాలని పేర్ని నాని అన్నారు. తాము ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి వైజాగ్ డ్రగ్ రాకెట్‌లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశామని తెలిపారు. 

విశాఖ డ్రగ్స్​ కేసులో  సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు, టీడీపీ వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా.. టీడీపీ బంధువులేనని పేర్ని నాని ఆరోపించారు. ఈ డ్రగ్స్ రవాణా వెనుక చంద్రబాబు చుట్టాలు ఉంటూనే జగన్ మీద విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ డ్రగ్స్ కేసు  దేశం మొత్తం ఉలిక్కి పడిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Also Read :డ్రగ్స్ విషయంలో టీడీపీ...బీజేపీ నేతల పాత్ర ఉంది

బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు, లోకేష్ దిగజారారా అనే అనుమానం కలుగుతోందని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనేనని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిన వాడు కాబట్టి.. డ్రగ్స్ రవాణాపై లోతైన విచారణ చేపట్టాలని కోరారు. ఓటు కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు కాబట్టి.. విచారణ జరిపించాలని కోరామన్నారు. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు ట్వీట్ చేశారు.. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టేనని తెలిపారు.

చంద్రబాబు అవాస్తవాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఫిర్యాదు చేశామని చెప్పారు. లోతుగా విచారణ జరిపించాలని కోరా ఎన్నికల కమిషన్ కోరామన్నారు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని, చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఓట్లు కొనుగోలు చేయం కోసం ఈ డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమోనని అనుమానం ఉందని పేర్ని నాని అన్నారు.