
లోక్ సభ ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ కండువా కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీచేసి ఓడిపోయిన డీకే అరుణ.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. మహబూబ్ నగర్ లోక్ సభ నుంచి ఆమె బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.