
- వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో పతకం సాధించిన హెడ్‌కానిస్టేబుల్
గోపాల్‌పేట, వెలుగు : అమెరికాలోని అల్బామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన పసుపుల కృష్ణారావు హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున కృష్ణారావు.. అమెరికాలో జరుగుతున్న ఇండోర్ రోయింగ్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి సుమారు 8,500 మంది పాల్గొనగా.. 50 ప్లస్ విభాగంలో కృష్ణారావు గోల్డ్‌మెడల్ సాధించాడు. దీంతో బుద్దారం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.