డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు .. ఫిట్స్ నకిలీ ట్యాబ్లెట్లు సీజ్

డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు .. ఫిట్స్ నకిలీ ట్యాబ్లెట్లు సీజ్

ముషీరాబాద్, వెలుగు: సన్​ ఫార్మా లేబుల్​తో అమ్ముతున్న నకిలీ లెవీపిల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​లో శనివారం ఈ నకిలీ ట్యాబ్లెట్లు పట్టుకోగా, వీటిని కవాడిగూడ ఎస్బీఐ కాలనీలోని అరవింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్​నుంచి సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు

. ఈ క్రమంలో ఆదివారం ఇక్కడ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నకిలీ లెవీపిల్ ట్యాబ్లెట్స్ గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఫిట్స్ ట్రీట్మెంట్ లో వాడే  లెవీపిల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లను నకిలీ బ్యాచ్ వివరాలతో తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు.