కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరం బడ్జెట్ ఎందుకు పెరిగిందో తెలియదు : విచారణలో ఈటెల

కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరం బడ్జెట్ ఎందుకు పెరిగిందో తెలియదు : విచారణలో ఈటెల

కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేందర్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతా నిజమే చెబుతాను అని ప్రమాణం చేసిన తర్వాత కమిషన్ ప్రశ్నలు వేసింది. 

కమిషన్ ప్రశ్న : ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్థిక మంత్రిగా పని చేశారు?
ఈటెల సమాధానం : 2014 జూన్ నుంచి 2018 డిసెంబర్ 18 వరకు మంత్రిగా పని చేశాను. 
కమిషన్ ప్రశ్న : కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణం ఎవరు నిర్ణయం తీసుకున్నారు..?
ఈటెల సమాధానం : కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయంతోనే నిర్మాణం
కమిషన్ ప్రశ్న : ఎందుకు ప్రాజెక్టు షిఫ్ట్ చేయ్యాల్సి వచ్చింది. రీ డిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది..?
ఈటెల సమాధానం : టెక్నికల్ టీమ్, ఎక్స్పర్ట్ కమిటీలు గోదావరిపై అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డను సూచించాయి, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, హరీష్ రావులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. సబ్ కమిటీ రిపోర్ట్ తర్వాత కేబినెట్ లో అప్రూవ్ తర్వాత రీ డిజైనింగ్ జరిగింది.

కమిషన్ ప్రశ్న : కేబినెట్ లో అప్రూవ్ ఉందా?
ఈటెల సమాధానం : అన్నికేబినెట్ ఆమోదం తర్వాతే జరిగాయి.

కమిషన్ ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ 60 వేల కోట్ల నుంచి 83 వేల కోట్లకు ఎందుకు పెరిగింది..?
ఈటెల సమాధానం : అంత బడ్జెట్ ఎందుకు పెరిగిందో.. ఎంత అయిందో తెలియదు.
కమిషన్ ప్రశ్న : ప్రాజెక్ట్ DPR కోసం Vpakos కంపెనీకి రూ.594.45 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందా..?
ఈటెల సమాధానం : నాకు తెలియదు.

కమిషన్ ప్రశ్న : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశ్యం ఏంటి..?
ఈటెల సమాధానం : ఒకేసారి అంత అమౌంట్ కావాలంటే బడ్జెట్ సరిపోదు.. అప్పుల ద్వారా నిధులు సమర్చేందుకు కార్పొరేషన్ ఏర్పాటు. 

కమిషన్ ప్రశ్న : బ్యారేజీల నిర్మాణంతో వచ్చే రాబడితో రుణాల తిరిగి చెల్లింపు అనేది ఆధారపడి ఉంటుందని విజయా బ్యాంక్ చెప్పింది కదా..?
ఈటెల సమాధానం : ఆ వివరాలు తనకు తెలియదు. కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత కేసీఆర్ వాల్లే చూస్తున్నారు.

కాళేశ్వరం జ్యుడీషియల్ విచారణకు హాజరైన ఈటెల రాజేందర్ కు కమిషన్ నుంచి వచ్చిన ప్రశ్నలు.. వాటి సమాధానం ఇవి. 9న మరో మాజీ మంత్రి హరీశ్ రావు.  11న అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.