యాక్టర్స్ నాగచైతన్య, సమంత విడాకులపై కాంట్రావర్సీ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కి పదవి కాంక్ష ఎక్కువ.. కేసీఆర్న్ని ఫామ్ హౌజ్ లోపల కేటీఆర్ గొంతు పిసికిండో ఎమోనన్న అనుమానం వస్తుందని తీన్మార్ మల్లన్న అంటున్నారు. మరీ తీన్మార్ మల్లన్న అనుమానం వ్యక్తం చేసినట్లు ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో ఏమో కానీ.. గత కొన్ని రోజులుగా కేసీఆర్ మాత్రం కనిపించడం లేదని మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గజ్వేల్ నియోజవర్గం నుండి గెలిచిన వ్యక్తి సలహాలు ఇవ్వమంటే ఎక్కడున్నాడో తెలియదని.. మిమ్మల్ని గెలిపించిన గజ్వేల్ ప్రజలకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలని కేసీఆర్‌ను నిలదీశారు. మా ఎమ్మెల్యే కనబడటం లేదని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని కేసు పెట్టమని నేను కోరుతున్నానని గజ్వేల్ ప్రజలకు సూచించారు.
మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలువలేకపోయిందనే భావన నాలో ఉందన్నారు. బీజేపీకి బీఆరెస్ అమ్ముడు పోవడం వల్లనే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మెదక్‌లో ఓటమి పాలయ్యారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్ నుండి బయటికి రావడం కోసం చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. మెదక్‌లో మేము గెలువకున్న సరే బీజేపీని గెలిపించాలనే విధంగా బీఆర్ఎస్ పని చేసిందని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు పోతుంటే.. పనికి మాలిన సోషల్ మీడియాతో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తప్పడు ప్రచారం చేయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :- కేటీఆర్, హరీశ్ ఫాంహౌస్ మురికినీళ్లు.. పేదలు తాగాలా
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలుకావడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అధికారం కోల్పోయే సరికి కేటీఆర్‌కి మతిభ్రమించి తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు. హైడ్రా, మూసీ అంటూ కేటీఆర్ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నాడని.. అస్సలు మూసీ ప్రక్షాళనకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకిస్తూ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపితే ఊపేక్షించబోమని.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నానని సురేఖ వార్నింగ్ ఇచ్చారు.