ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. జోకులు, సెటైర్లు, సినిమా డైలాగులతో అందర్ని నవ్విస్తారు. అవసరమైతే తొడ గొట్టి సవాల్ విసురుతారు. తగ్గేదే లే అంటూ పుష్పా సినిమా డైలాగులు కూడా చెప్పేస్తారు. డ్యాన్సులతో అదరగొడతారు. హుషారుగా ఊర మాస్ స్టెప్పులేసి మోత పుట్టి్స్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఎంటర్టైనింగ్ పొలిటీషియన్. ఆయనెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. అంటే.. యస్.. ఆయనే.. మాజీ మంత్రి మల్లారెడ్డే. తాజాగా ఆయన ఊర మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది.
*మనవరాలి పెళ్లి సంగీత్లో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్* మాస్ సాంగ్స్ కు మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు video video pic.twitter.com/YKI0OqqtyY
— Mr. Mohan (@kundenapally_12) October 21, 2024
..dj tillu song ki malla Reddy dance pic.twitter.com/PPsGclpsae
— Mr. Mohan (@kundenapally_12) October 21, 2024
‘తాతా వచ్చాడే.. అదరగొట్టి పోతాడే’ సాంగ్కు, ‘నాటు నాటు’ సాంగ్కు, ‘డీజే టిల్లు’ సాంగ్కు గ్రూప్ డ్యాన్స్ చేసి, ఊర మాస్ స్టెప్పులేసి మల్లారెడ్డి అదరగొట్టారు. ఈ డ్యాన్స్ ఎక్కడ చేశారా అని ఆరా తీయగా.. ఆయన మనవరాలి సంగీత్ వేడుకలో మల్లారెడ్డి ఇలా జోరుగా.. హుషారుగా.. స్టెప్పులేసినట్లు తెలిసింది. మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు మర్రి శ్రేయారెడ్డి, ఆదిత్య వివాహం అక్టోబర్ 27న జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్లో మల్లారెడ్డి ఇలా డ్యాన్స్ చేసి సందడి చేశారు.
Malla Reddy dance.. pic.twitter.com/voMv2wDv1L
— Mr. Mohan (@kundenapally_12) October 21, 2024
Also Read:- హౌజ్లో ఊహించని ట్విస్ట్
మల్లారెడ్డి గతంలోనూ పలుమార్లు స్టెప్పులేసి సందడి చేసిన విషయం తెలిసిందే. తన మనవరాలి పెళ్లికి రావాలని తెలుగు రాష్ట్రాలు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబును స్వయంగా కలిసి మరీ మల్లారెడ్డి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వెళ్లారు. ఆయన వెంట తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని కిషన్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు.