మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(63) కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో గురువారం మృతిచెందారు. కొద్దికాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు గురువారం ఉదయం ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి. కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు డాక్టర్లు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సమ్మయ్య సర్సిల్క్ కార్మికుడిగా చేశారు. మిల్లుమూతపడటంతో 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ తరఫున క్రియాశీలకంగా పాల్గొన్నారు. 2009లో ఎమ్మెల్యే గా గెలిచారు. తెలంగాణ కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు పదవికి రాజీనామా చేసి 2011లో బై ఎలక్షన్స్ లో మళ్లీ గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. బీ ఫామ్ రాకపోవడంతో నామినేషన్ విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమ్మయ్యకు భార్య సాయిలీలతో పాటు ముగ్గురు కొడుకులు ఉన్నారు. అంత్యక్రియలు కాగజ్ నగర్ లో గురువారం రాత్రి పూర్తి చేశారు.

సీఎం సంతాపం
కావేటి సమ్మయ్య మృతికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ
సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

For More News..

కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్

కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది