బీఆర్ఎస్కు షాక్..కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్కు షాక్..కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ..అధికార పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ లో చేరారు. సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  నల్లాల ఓదేలుకు  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 

నల్లాల ఓదేలుతో పాటు ఆయన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కౌన్సిలర్ శివ కిరణ్, నల్లాల శ్రావణ్, నల్లాల సందీప్, దుర్గం నరేష్, ముజాహిద్, మెరుగు ప్రభాకర్, మహేందర్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గతంలో ప్రియాంక గాంధీ సమక్షంలో నల్లాల ఓదేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగి వెంటనే బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌లో చేరారు.  ఓదెలుకు తెలంగాణ ఉద్యమ కారుడిగా మంచి పేరుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌లో చేరిన్నట్లు ఓదేలు తెలిపారు.