
నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లోని తన ఆఫీస్ లో కవిత మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కవిత … బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఈ ఫలితం అనూహ్యం కావడంతో… రాష్ట్ర,దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఓటమికి గల కారణాలను టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది.