ఆర్టీసీ కార్మికుల ఆవేదన టిఆర్ఎస్ నేతలకు వినపడటం లేదా అని ప్రశ్నించారు… మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేశవరావు ఒక్కరే మనసుతో స్పందించారని తెలిపారు. నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయన్ను కలిశానని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆర్టీసీ సమ్మెతో అందరూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కు పోలీస్ శాఖ ఒక్కటి ఉంటే సరిపోతుందని ఆరోపించారు. సీఎం నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతామని కేకే చెప్పారన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

