జగన్ కు మరో షాక్: వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్...

జగన్ కు మరో షాక్: వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్...

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు మంగళగిరి పోలీసులు. గురువారం ( సెప్టెంబర్ 5, 2024 ) ఉదయం హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు. శుక్రవారం ( సెప్టెంబర్ 4, 2024 )  ఏపీ హైకోర్టు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేయడంతో ఆయనను అరెస్ట్ చేశారు.

శుక్రవారం నుంచి అజ్ఞాతంలో ఉన్న సురేష్ ను పక్కా సమాచారంతో ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా... హైకోర్టు నందిగం సురేష్ సహా ఇతర వైసీపీ నేతల బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసిన క్రమంలో వారిని అరెస్ట్ కూడా ఖాయంగానే కనిపిస్తోంది. మరి, కీలక నేతల వరుస అరెస్టులు వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది వేచి చూడాలి.