బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా

బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖను నవంబర్ 1న  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. ఇన్నాళ్లు బీజేపీలో తనకు అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు వివేక్ వెంకటస్వామి. కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న వివేక్.. బీజేపీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. వివేక్ వెంకటస్వామిని  ఇటీవల బీజేపీ ఎన్నికల మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించింది అధిష్టానం. 

Also Read : మళ్లీ బీఆర్ఎస్లో చేరిన రామ్మోహన్ గౌడ్

వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంట్ లో పోరాటం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేయటం ఆసక్తిగా మారింది.