మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ

V6 Velugu Posted on Oct 16, 2021

కొన్నిరోజుల కింద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (89) అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ కు తరలించారు. ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో డాక్టర్లు చికిత్స అందించారు. లేటెస్టుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్  సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు వివరించారు. ఆయన వ్యక్తిగత డాక్టర్ డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఎయిమ్స్ డాక్టర్ల టీం ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని తాజా బులెటిన్ లో తెలిపారు. 

Tagged AIIMS, Ex-PM Manmohan Singh, diagnosed, dengue, condition improving

Latest Videos

Subscribe Now

More News