సైలంట్‌ చాణక్యుడిలా వ్యవహరించిన ప్రణబ్

సైలంట్‌ చాణక్యుడిలా వ్యవహరించిన ప్రణబ్

ఇందిరా గాంధీకి నమ్మినబంటు
సోనియా రాజకీయ ప్రవేశంలో కీలక నేత
మన్మోహన్ క్యాబినెట్‌లో పలు మంత్రి పదవులు
జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్
ప్రపంచంలోనే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఘనత

క్లర్క్‌గా  మొదలు..
రాజకీయాల్లోకి రాకముందు ప్రణబ్ కోల్ కతాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో అప్పర్ డివిజన్ క్లర్క్ గా పనిచేశారు. ఆయన 1963లో కోల్ కతాలోని విద్యానగర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. ఆయన దేశర్ దాక్ (మాతృభూమి పిలుపు) అనే పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు.

రాజీవ్ తో విభేదాలు.. సొంత పార్టీ ఏర్పాటు
1984లో ఇందిర హత్య తర్వాత రాజీవ్ గాంధీ పాలిటిక్స్ లోకి వచ్చేవరకూ పార్టీలో ప్రణబ్ అందరికీ తలలో నాలుకలా మెదిలారు. రాజీవ్ ఆయనను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి తప్పించారు. వెస్ట్ బెంగాల్ పీసీసీకి పంపారు. రాజీవ్ గాంధీ తగిన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. సొంతంగా ‘రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్ సీ)’పార్టీని స్థాపించారు. 1989లో రాజీవ్ తో విభేదాలు తొలగిపోయిన తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రణబ్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా నియమించారు.1995–96లో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఏడాదిలోపే పార్లమెంటుకు..
ప్రణబ్ 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీకే కృష్ణ మీనన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ టైంలో ప్రణబ్ టాలెంట్ ను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇందిర పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరిన ఆయన కొద్దికాలంలోనే ఆమెకు నమ్మిన బంటుగా మారారు. అదే ఏడాది (1969) కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1973లో ఇందిర కేబినెట్ లో మంత్రిగా నియమితులయ్యారు. తర్వాత 1975, 1981, 1993, 1999లోనూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1975 నుంచి 77 మధ్య ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రణబ్ యాక్టివ్ గా పనిచేశారు. 1982 నుంచి 84 వరకూ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అదే సమయంలో మన్మోహన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారు. 1979లో రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గా, 1980లో లీడర్ ఆఫ్ ది హౌజ్ గా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నరోజుల్లో ఆయన గైర్హాజరైనప్పుడు ప్రణబ్ ముఖర్జీయే కేబినెట్ కు అధ్యక్షత వహించేవారు.

న్యూఢిల్లీ: దేశంలోనే మంచి వక్త, విద్యావేత్త, స్టేట్స్ మన్, రచయితగా పాపులర్ అయిన లీడర్ ప్రణబ్ ముఖర్జీ. దేశానికి 13వ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టే వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీలో, జాతీయ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక నేతగా, ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. మౌనంగా ఉంటూనే చాణక్యుడిలా వ్యవహరించారని ఎనలిస్టులు అంటుంటారు. కాంగ్రెస్, యూపీఏ సర్కార్ లలో డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ శాఖ, కామర్స్, షిప్పింగ్, ఇండస్ట్రీస్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. యూరో మనీ మ్యాగజైన్ 1984లో నిర్వహించిన సర్వేలో ఆయన ప్రపంచంలోనే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా నిలిచారు. అందరిచేతా ‘ప్రణబ్ దా’ అని ఆప్యాయంగా పిలిపించుకున్న ఆయన.. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశంలోనే పాపులర్ లీడర్ గా చక్రం తిప్పారు. ప్రణబ్ పెద్ద కొడుకు అభిజిత్ బెంగాల్ లోని జాంగీపూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ప్రణబ్ బిడ్డ శర్మిష్ట కథక్ డ్యాన్సర్ గా, కాంగ్రెస్ లీడర్గా గుర్తింపు పొందారు.

మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్…
ప్రణబ్ ముఖర్జీ ‘అన్ని కాలాలకూ గుర్తుంచుకోదగ్గ వ్యక్తి’గా పేరు పొందారు. ఇండో–యూఎస్ న్యూక్లియర్ డీల్ లో కాంట్రవర్సీ అయిన 123 అగ్రిమెంట్ విషయంలో ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. ఈ అగ్రిమెంట్ విషయంలో ఇండియాకు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో మినహాయింపును తేవడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించారు.

ఫ్రీడమ్ ఫైటర్ ఇంట్లో పుట్టారు..
ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 11, 1935న అప్పటి బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరాటీ (ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా)లో జన్మించారు. ప్రణబ్ తండ్రి ఇండిపెండెన్స్ మూమెంట్ లో యాక్టివ్ గా పనిచేశారు. 1952 నుంచి 1964 వరకు ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ప్రణబ్ సూరిలోని విద్యా సాగర్ కాలేజ్ లో చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. అదే యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ డిగ్రీ కూడా పొందారు.

సోనియాకు వెన్నుదన్నుగా..
1998లో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన సోనియా గాంధీకి ప్రణబ్ ముఖర్జీ వెన్నుదన్నుగా నిలిచారు. కీలకమైన వ్యవహారాల్లో ఆమెను గైడ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ వల్లే రాజకీయాల్లోకి సోనియా ఎంట్రీ సక్సెస్ ఫుల్ గా జరిగిందని చెప్తారు. సోనియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక.. ఆయనను 1998లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించారు. 2000 ఏడాది నుంచి 2010 వరకూ ప్రణబ్ వెస్ట్ బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. 2004లో ఆయన తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి లోక్ సభలో లీడర్ ఆఫ్ ద హౌజ్ గా వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా నియమితులవడానికి ముందు వరకూ ప్రణబ్ ముఖర్జీయే ప్రధాని అవుతారని అప్పట్లో ఊహాగానాలు జోరుగా సాగాయి. తర్వాత మన్మోహన్ కేబినెట్ లో ఆయన డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు.

ప్రణబ్ రాసిన పుస్తకాలు..
మిడ్ టర్మ్ పోల్ బియాండ్ సర్వైవల్: ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (1984)
ఆఫ్ ద ట్రాక్ (1987)
ద శాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ శాక్రిఫైస్ (1992)
చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ (1992)
ఏ సెంటెనరీ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2011)
కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ (2011)
థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014)
ద డ్రమటిక్ డికేడ్: ది ఇందిరా గాంధీ ఇయర్స్ (2014)
సెలెక్టెడ్ స్పీచెస్ – ప్రణబ్ ముఖర్జీ (2015)
ద టర్బులెంట్ ఇయర్స్: 1980–1996 (2016)
ద కొయలిషన్ ఇయర్స్
ప్రణబ్ నిర్వహించిన

కీలక పదవులు..
యూనియన్ ఇండస్ట్రీస్: 1973-1974
యూనియన్ షిప్పింగ్, ట్రాన్స్ పోర్ట్: 1974
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి:1974-1975
యూనియన్ రెవెన్యూ అండ్ బ్యాంకింగ్: 1975-1977
యూనియన్ కామర్స్, స్టీల్ అండ్ మైన్స్ :1980-1982
యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్: 1982-1984
యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ సప్లై: 1984
ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్: 1991-1996
యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్:1993-1995
యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్: 1995-1996
సార్క్ కౌన్సిల్ ఆఫ్మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్: 1995
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ: 1998-1999
లోక్ సభలో లీడర్ ఆఫ్ ది హౌజ్: 2004-2012
యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్: 2004-2006
యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్: 2006-2009
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి: 2009-2012
ప్రెసిడెంట్ ఆఫ్ఇండియా: 2012 – 2017

అంతర్జాతీయ పదవులు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్: 1982–1985
వరల్డ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్: 1982–1985
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్: 1982–1984
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంక్: 1982-1985

అవార్డులు, పురస్కారాలు..
భారత రత్న (2019)
పద్మ విభూషణ్ (2008)
బంగ్లాదేశ్ ముక్తిజుద్దో సన్మానోనా (2013)
ఐవరీ కోస్ట్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ (2016)
సైప్రస్ – గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్మకరియోస్ II–
బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ వరల్డ్ (1984; యూరోమనీ మ్యాగజైన్ సర్వే)
ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇయర్ ఫర్ ఏసియా (2010; వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ న్యూస్ పేపర్ ఎమర్జింగ్ మార్కెట్స్)
ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇయర్ (2010; బ్యాంకర్ సంస్థ ద్వారా)
ఐవరీ కోస్ట్– హానరరీ సిటిజన్షిప్ ఆఫ్ అబిద్జాన్ (2016)
వీటితో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలు ఆయనను గౌరవ డిగ్రీలు, డాక్టరేట్లతో గౌరవించాయి.

For More News..

ఆ స్నేహంతోనే తెలంగాణ కోసం సపోర్ట్ చేసిండు

రెండుసార్లు చేజారిన పీఎం చాన్స్