
ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని పెద్దపంజాణి మండలం వీరిపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరుగుతుండగా శనివారం ( అక్టోబర్ 12 ) మెరుపుదాడి చేశారు. తవ్వకాలు జరుపుతున్న చిత్తూరు జిల్లా వైసీపీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి దగ్గరినుంచి నాలుగు బైకులు, జేసీబీ, కారు, పూజాసామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం బంటపల్లెకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. తవ్వకాలు జరిపేందుకు వచ్చిన ఇద్దరు స్వామిజీలతో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు పోలీసులు.