నీట్ ఎగ్జామ్ లో హార్వెస్ట్ కు అద్భుత ఫలితాలు

నీట్ ఎగ్జామ్ లో హార్వెస్ట్ కు అద్భుత ఫలితాలు

ఖమ్మం టౌన్, వెలుగు : నీట్ ఎగ్జామ్ రిజల్ట్ లో హార్వెస్ట్ కు అద్భుత ఫలితాలు వచ్చినట్లు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల మేనేజ్​మెంట్ తెలిపింది. ఎ. జీగ్నేశ్​కృష్ణ ప్రసాద్ 667, కే. శ్రీప్రియతమ్ 633, పి.పునీత్ 609, ఎం. నవదీప్ 600, ఎస్.గోకుల్ కిషోర్ రెడ్డి 596, జి.హేమసాయి 571, కె.షారోన్ పెర్సిస్ 551, ఎం. కుశల్ తేజ 516, ఈ.నాగ మౌనిక 429, ఐ. అన్విత 429 మార్కులు సాధించినట్లు పేర్కొంది. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల అధినేత రవి మారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి అభినందించారు.