మరికల్, వెలుగు : విద్యార్థులు ఆటల్లో రాణిస్తే.. భవిష్యత్తులో ఎంతో ఉపయోగం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక బాలుర హైస్కూల్లో సీఎం కప్లో భాగంగా టార్చ్ ర్యాలీని సర్పంచి చెన్నయ్య, ఎస్సై రాములు తో కలిసి ప్రారంభించారు.
పల్లె గ్రామాల్లో ఉన్న విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఆటలో రాణించి జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిలో రాణించేందుకు కష్టపడాలని విద్యార్థులను కోరారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. జీహెచ్ఎం నాగరత్నమ్మతో పాటు వ్యాయమ ఉపాధ్యాయులు ఉన్నారు.
