ఎక్సైజ్ కానిస్టేబుల్ బెదిరింపులు : డబ్బులు ఇవ్వకపోతే.. డ్రగ్స్ కేసు బుక్ చేస్తా

ఎక్సైజ్ కానిస్టేబుల్ బెదిరింపులు : డబ్బులు ఇవ్వకపోతే.. డ్రగ్స్ కేసు బుక్ చేస్తా
  • సినీ ప్రముఖులు, వ్యాపారులకు  ఎక్సైజ్ కానిస్టేబుల్ దమ్కీ
  • నిందితుడు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: డ్రగ్స్​కేసు బుక్​చేస్తానంటూ.. సినీ ప్రముఖులు, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఎక్సైజ్​కానిస్టేబుల్​అరెస్టయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. 

ఈజీగా డబ్బులు సంపాదించాలనుకొని సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేశాడు. అనుమతి లేకుండా పలువురి ఇండ్లలోకి వెళ్లి తనను ఎక్సైజ్ సీఐగా పరిచయం చేసుకున్నాడు. మీరు డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉందని డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసు బుక్​ చేస్తానని బెదిరించాడని బాధితుల్లో కొందరు ఫిర్యాదు చేశారు. పోలీసులు రిమాండ్ కు తరలించారు.