డ్రగ్స్ కేసులను మేమే దర్యాప్తు చేస్తాం.. కాదు మేమే చేస్తాం

డ్రగ్స్ కేసులను మేమే దర్యాప్తు చేస్తాం.. కాదు మేమే చేస్తాం

డ్రగ్స్ కేసులను కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో నమోదైన
డ్రగ్స్ కేసులకు సంబంధించిన నివేదికను ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు సమర్పించింది. అందులో భాగంగా.. 2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తయిందని హైకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని.. మరో కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తామని ఎక్సైజ్ శాఖ కోర్టుకు తెలిపింది. డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతో పాటు తమకూ ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయినా
ఇప్పటికే దర్యాప్తు పూర్తయిన కేసులను కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కాగా.. ఎక్సైజ్ శాఖ తమకు డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఛార్జ్ షీట్లు, వాగ్మూలాలు ఈడీకి ఇచ్చేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని అదనపు సోలిసిటర్ జనరల్ హైకోర్టును కోరారు. ఎక్సైజ్ శాఖ కోర్టుకు ఇచ్చిన నివేదికలో కనీస వివరాలు లేవని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపింది. ఎక్సైజ్ శాఖ నివేదికపై అభ్యంతరాలను కోర్టుకు సమర్పించేందుకు తమకు గడువు ఇవ్వాలని రచనా రెడ్డి కోర్టును కోరింది. దాంతో కోర్టు ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

For More News..

బంపర్ ఆఫర్.. బిల్లు రూ.15 వేలు.. టిప్ రూ. 3.67 లక్షలు

వీడియో: భుజాలపై చేతులేసుకొని వెళ్తున్న స్నేహితులు.. ఒకరి మీద కూలిన పిల్లర్

వీడియో: ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఐఫోన్.. అయినా దొరికింది