కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు 

కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు 

మెట్ పల్లి, వెలుగు : మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వెల్లుళ్ల ఎల్లమ్మ ఆలయం వద్ద విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్లు అమ్మకాలను అబ్కారీ అధికారులు, గౌడ కులస్తులు మంగళవారం అడ్డుకున్నారు. సొసైటీలో సభ్యత్వం లేకుండా, లైసెన్స్ లేకుండా వీడీసీ ఆధ్వర్యంలో కల్లు అమ్ముతున్నారని గౌడ కులస్తులు ఆబ్కారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో మంగళవారం డీటీఎఫ్ సీఐ రాజమౌళి, సీఐ వినోద్ రాథోడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ టెంపుల్ వద్దకు వెళ్లి లైసెన్సు లేకుండా వీడీసీ ఆధ్వర్యంలో అమ్ముతున్న కల్లును పారబోశారు. దీంతో వీడీసీ, గౌడకులస్తులకు వాగ్వాదం జరిగింది.  అనంతరం ఇరువర్గాలతో ఆబ్కారీ పోలీసులు సమావేశం నిర్వహించి సముదాయించారు.