అల్ప్రాజోలం అక్రమ రవాణాలో ఎక్సైజ్ కానిస్టేబుల్!

అల్ప్రాజోలం అక్రమ రవాణాలో ఎక్సైజ్ కానిస్టేబుల్!

కామారెడ్డి, వెలుగు: అల్ప్రాజోలం అక్రమ రవాణా కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురిని నార్కొటిక్​స్పెషల్​టీమ్​అదుపులోకి తీసుకుంది. ఇందులో ఓ ఎక్సైజ్​కానిస్టుబుల్ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్​సమీపంలోని షాద్ నగర్​లో పెద్ద మొత్తంలో అల్ప్రాజోలం పట్టుబడింది. నార్కొటిక్​స్పెషల్​టీమ్ ​ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వారి పేర్లు బయటకు వచ్చాయి.

 రెండు రోజుల కింద కామారెడ్డి ఎక్సైజ్​స్టేషన్​లో పనిచేసే కానిస్టేబుల్, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్​పల్లికి చెందిన కల్లు వ్యాపారులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్​కానిస్టేబుల్​రమేశ్​ను సోమవారం షాద్​నగర్​లో అరెస్ట్​చేసినట్లు తెలిసింది. ఎక్సైజ్​కానిస్టేబుల్ నాలుగు రోజులుగా డ్యూటీకి రావడం లేదని తెలుస్తోంది.