ఆ లిక్కర్ షాప్ ఓనర్ పై కేసు

ఆ లిక్కర్ షాప్ ఓనర్ పై కేసు

బెంగళూరు : లాక్ డౌన్ కారణంగా మందుబాబులు 45 రోజులు లిక్కర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. సోమవారం వైన్ షాప్స్ ఓపెన్ కావటంతో మళ్లీ లాక్ డౌన్ ఎన్ని రోజులు పొడగించినా సరే మందుకు కొరత లేకుండా కొని పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా 52, 841 రూపాయల విలువ చేసే లిక్కర్ కొనుగోలు చేశాడు. ఈ బిల్లు సోమవారమంతా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఇదే బిల్లు ఆధారంగా ఇప్పుడు కర్ణాటక ఎక్సైజ్ అధికారులు ఆ లిక్కర్ షాప్ పై కేసు నమోదు చేశారు. అనుమతించిన దాని కన్నా ఎక్కువ మద్యాన్ని అమ్మడంటూ షాప్ ఓనర్ పై కేసు బుక్ చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజు ఒక వ్యక్తికి 2.6 లీటర్ల మద్యం మాత్రమే విక్రయించాలి. బీర్ అయితే 18 లీటర్ల వరకు అనుమతి ఉంది. కానీ సోమవారం బెంగళూరులో వనిల్లా స్పిరిట్‌ జోన్‌ ఏకంగా 13.5 లీటర్ల లిక్కర్‌, 35 లీటర్ల బీర్‌ ను అమ్మింది. దీంతో షాప్ ఓవర్ పై కేసు పెట్టటంతో పాటు బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. లిక్కర్ షాప్ ఓనర్ మాత్రం అది 8 మంది వినియోగదారులకు సంబంధించిన బిల్లు అని చెబుతున్నాడు.