విద్యార్థులు, అడ్డా కూలీలే లక్ష్యంగా హెరాయిన్ విక్రయం

విద్యార్థులు, అడ్డా కూలీలే లక్ష్యంగా హెరాయిన్ విక్రయం

హైదరాబాద్ : కొండాపూర్ లో హెరాయిన్ ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి లక్ష రూపాయలు విలువ చేసే 48 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ లో డ్రగ్స్ అమ్ముతున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సింతు లాలా(38)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 

నిందితుడు సింతు లాలా.. పశ్చిమ బెంగాల్ నుండి అక్రమంగా హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నాడని తమ విచారణలో తేలిందని టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు, అడ్డా కూలీలే లక్ష్యంగా హెరాయిన్ ను విక్రయిస్తున్నాడని తెలిపారు. నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.