75 ఏళ్లు పైబడినవారికి ఐటీ నుంచి మినహాయింపు

75 ఏళ్లు పైబడినవారికి ఐటీ నుంచి మినహాయింపు

బడ్జెట్‌లో ఐటీకి సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు కానీ, స్లాబుల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే 75 ఏళ్లు పైబడినవారికి మాత్రం ఐటీ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధన పెన్షన్ ఆదాయం వచ్చేవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 6.48 లక్షల మంది ట్యాక్స్ పే చేస్తున్నారు. వీరందరి కోసం ఫేస్ లెస్ ఐటీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో మనదేశంలోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉందని ఆమె అన్నారు. ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట కల్పిస్తున్నట్లు ప్రకటించారు. డివిడెండ్లపై ఇకనుంచి నో అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ అని ఆమె తెలిపారు. ఆఫర్డబుల్ హౌజింగ్‌కు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ తగ్గింపు కంటిన్యూ చేస్తామని ప్రకటించారు.