బాడీని బట్టి వ్యాయామం

బాడీని బట్టి వ్యాయామం

మనుషుల్లో రకాలున్నట్టే మనిషి శరీరాల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చుట్టూ ఉన్నవాళ్లను ఒకసారి గమనిస్తే..వాళ్లలో కాస్త బొద్దు గా ఉన్న వాళ్లుంటారు, కండలు తిరిగిన వాళ్లుంటారు, సన్నగా ఉన్నవాళ్లూ ఉంటారు. వీళ్లం దరూ ఫిట్‌‌‌‌‌‌గా ఉండడం కోసం రోజూ రకరకాల వర్కవుట్లు చేస్తుం టారు. కానీ అన్ని బాడీ టైప్స్‌‌‌‌కి అన్ని వర్కవుట్స్ సెట్ అవుతాయా? బాడీ టైప్‌‌‌‌ను బట్టి వర్కవుట్స్‌‌‌‌ను ఎలా ఎంచుకోవాలి? శరీరాకృతులు ముఖ్యంగా మూడు రకాలుంటాయి. ఎండోమార్ఫ్‌, ఎక్టోమార్ఫ్‌, మెసోమార్ఫ్‌. బాడీ జీన్స్, తీసుకునే ఫుడ్, లైఫ్‌ స్టైల్‌ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకమైన బాడీ టైప్ ఉంటుంది. అయితే అన్ని బాడీ టైప్స్‌‌‌‌కి ఒకే రకమైన వర్కవుట్లు సూట్ అవ్వవు. బాడీ టైప్‌‌‌‌ను బట్టి ఫిట్‌‌‌‌నెస్ ట్రైనింగ్ ఉండాలి.

ఎక్టో మార్ఫ్‌ ఎక్టో మార్ఫ్‌

ఎక్టో మార్ఫ్ టైప్ వాళ్లు చూడడానికి సన్నగా, భుజాలు, నడుము, ఛాతి చిన్నదిగానూ, చేతులు, కాళ్లు, సన్నవిగానూ ఉంటాయి. ఇలాంటి బాడీ టైప్ ఉన్నవాళ్లకి మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తీసుకున్న ఆహారంలోని క్యాలరీలన్నీ వెంటనే కరిగిపోతాయి. సరైన ఫుడ్‌‌‌‌ తినకపోయినా, రెగ్యులర్‌‌‌‌గా వర్కవుట్‌‌‌‌ చేయకపోయినా ఆ ప్రభావం వీళ్ల మీద బాగా పడుతుంది. వీక్‌ గా, డల్‌ గా కనపడే అవకాశం ఉంటుంది. కొవ్వు పదార్థాలు తీసుకున్నా కూడా వీళ్లకు ఇబ్బంది ఉండదు.  మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల శరీరం ఫ్యాట్‌‌‌‌ను స్టోర్ చేసుకోదు. కాకపోతే వీళ్లకు మజిల్ గ్రోత్ కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి బాడీ టైప్‌‌‌‌కి హెల్దీ ఫుడ్, వర్కవుట్స్‌‌‌‌ తప్పనిసరి. అయితే తమ బాడీ టైప్‌‌‌‌కి తగని వర్కవుట్‌‌‌‌ మితి మీరి చేస్తే కూడా వీక్‌ గా కనపడతారు.

ట్రైనింగ్ ఇలా..

ఎక్టో మార్ఫ్ వాళ్లు ఎక్కువగా స్ట్రెంత్ ట్రైనింగ్, కోర్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌సైజులు చేయాలి. మామూలు వర్కవుట్స్‌‌‌‌తో పాటు వెయిట్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు కూడా మిక్స్ చేయాలి. ప్రతీ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ ఐదు నుంచి పది సెట్ లు చేయాలి. ప్రతీ ఎక్సర్‌‌‌‌‌‌‌‌ సైజుకి మధ్యలో మూడు నుంచి ఐదు నిముషాలు గ్యాప్ ఇవ్వాలి. వీళ్లకు కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు అంతగా అవసరం ఉండదు. వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. ఎక్కువ క్యా లరీలున్న పోషకపదార్థాలతో పాటు ఎక్కువ బరువులతో కూడిన తక్కువ వ్యాయామాలు అవసరం.

మెసోమార్ఫ్

మెసోమార్ఫ్ బాడీ టైప్ ఉన్న వాళ్లకు విశాలమైన ఛాతి, బలమైన తొడలు, వెడల్పాటి భుజాలు, సన్నటి నడుము ఉంటాయి. వీళ్లు చాలా దృఢంగా ఉంటారు. శరీరంలో కండలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. మెసో మార్ఫ్ వాళ్లకు మెటబాలిజం నార్మల్‌ గా ఉంటుంది. మజిల్ గ్రోత్ బాగానే ఉంటుంది. కానీ డైట్ సరిగా లేకపోతే మజిల్స్‌‌‌‌తో పాటు కొవ్వు కూడా పెరిగే అవకాశముంది. అందుకే డైట్ విషయంలో వీళ్లు జాగ్రత్తగా ఉండాలి.

ట్రైనింగ్ ఇలా..

మెసోమార్ఫ్ బాడీ టైప్ ఉన్న వాళ్లకి మీడియం రేంజ్ వ్యా యామం, పోషకాహారం అవసరం. లైట్, మోడరేట్, హెవీ వెయిట్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు చేయాలి. బేసిక్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు స్క్వాట్స్, చెస్ట్ ప్రెస్, షోల్డర్ ప్రెస్, ప్లాంక్ , లాంటివి చేసినా మంచిదే. ప్రతి ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ పది నుంచి పదిహేను సెట్ లు చేయాలి. మామూలు వర్కవుట్స్‌‌‌‌తో పాటు రోజుకు ఐదు నుంచి పది నిముషాల పాటు ఏదో ఒక కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ కూడా చేయాలి. అవసరమైతే హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు.

ఎండోమార్ఫ్‌

ఎండోమార్ఫ్ బాడీటైప్ ఉన్నవాళ్లకు ముఖం గుండ్రంగా, భుజాలు వెడల్పుగా, తొడలు, నడుము పెద్దవిగా, మోచేతులు సన్నవిగా ఉంటాయి. ఈ బాడీటైప్ ఉన్నవాళ్లకు మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల తీసుకున్న క్యాలరీలు నెమ్మదిగా ఖర్చు అవుతాయి. అదనంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ ఫ్యాట్ కింద మారతాయి. దీంతో ఫాట్ త్వరగా పెరుగుతుంది.

ట్రైనింగ్ ఇలా..

ఇలాంటి వాళ్లు హై క్యా లరీ ఫుడ్‌‌‌‌ను తగ్గించి, ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. వీళ్లు టోటల్ బాడీ వర్కవుట్స్ చేయాలి. సరైన డైట్ పాటిస్తూ ఎక్కువ క్యాలరీలు కరిగించాలి. హెవీ వెయిట్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు ప్రాక్టీస్ చేయాలి. సెట్‌‌‌‌కి పది నుంచి పదిహేను సార్లు చొప్పున నాలుగైదు సెట్ లు చేయాలి. వర్కవుట్స్ ఫోకస్ అంతా ఫ్యాట్ బర్నింగ్‌‌‌‌పై ఉండాలి. ఎండోమార్ఫ్ వాళ్లకు ఒబెసిటీ, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లు హైకింగ్, స్విమ్మింగ్, సైక్లిం గ్ లాంటి కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజులు కూడా తప్పకుండా చేయాలి.