వయసు పెరిగేకొద్దీ మెదడు యాక్టివ్గా , యవ్వనంగా ఉండాలంటే..

వయసు పెరిగేకొద్దీ మెదడు యాక్టివ్గా , యవ్వనంగా ఉండాలంటే..

మానవ శరీరంలో మెదడు ఎంత ముఖ్యమో మనకు తెలుసు.. ఇది శరీర అవయవాలను మొత్తాన్ని ఫంక్షనింగ్ చేస్తుంది.. శరీరంలో ఏ పార్ట్ పనిచేయాలన్నా మెదడు తోనే జరుగుతుంది. అలాంటి ముఖ్యమైన, అత్యంత విలువైన మెదడును వయసు పెరుగుతున్న కొద్దీ  ఎప్పుడు యాక్టివ్ గా, యవ్వనంగా ఉంచుకోవాలంటే ఏం చేయా లి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలో రోజూ వ్యాయామం ..ఎల్లప్పుడు బ్రెయిన్ ను యం గ్, యాక్టివ్ గా ఉంచడమే కాకుండా న్యూరోడీజనరేటివ్ వ్యాధులనుంచి దూరంగా ఉంచు తుందని పరిశోధనల్లో తేలింది. 

వ్యాయామం మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. జ్ణానాన్ని, జ్ణాపక శక్తిని పెంచుతుంది. బ్యాడ్ మూడ్ నుంచి బయటపడేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనల నివేదిక లు చెబుతున్నాయి. వివిధ జీవ వ్యవస్థలపై వ్యాయామం చూపే ప్రభావాన్ని గురించి వివరిస్తున్నాయి. వ్యాయామం.. ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వ్యాధు లనుంచి పోరాడే సామర్థ్యాన్ని ఇవ్వడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో.. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

వ్యాయామం చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ వంటి అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. 

ట్రేడ్  మిల్ పై పరుగెత్తడం, రన్నింగ్ ట్రాక్ పై పరుగెత్తడం, బరువులు ఎత్తడం, లంచ్ చేసిన తర్వాత నాలుగు అడుగులు వేయడం వంటి యాక్టివిటీలతో శక్తిని పెంచుకోవడం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం వంటి ప్రయోజనాలను పొందొచ్చు. దీంతోపాటు  సాధారణ వ్యాయామం (శారీరక శ్రమ ) మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడు పనితీరుకు పదును పెడుతుందని అధ్యయనాల నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మెదడుకు, శరీరానికి డీప్ ఫంక్షనింగ్ చేస్తుందని నొక్కి చెబుతున్నాయి. 

ఇంకో విషయాన్ని కూడా ఈ పరిశోధనలు రుజువు చేశాయి. అదేంటంటే.. ఆరోగ్యకరమైన జీవన శైలికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంత కీలకమో.. తీవ్రమైన వ్యాయామం (అతిగా ఎక్సర్ సైజ్ ) అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.