జనవరి ఒకటి నుంచి నుమాయిష్ ప్రారంభం..

జనవరి ఒకటి నుంచి నుమాయిష్ ప్రారంభం..

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, అలాగే విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహిస్తున్న  నుమాయిష్‌ ఎగ్జిబిషన్  జోరుగా కొనసాగనుంది. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ ప్రదర్శన దేశ, విదేశాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. 

83వ వార్షిక నుమాయిష్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఏర్పాటు చేసే వ్యాపారులను దరఖాస్తు చేసుకోవల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.  లొకేషన్ బట్టి వీటి ధరను నిర్ణయిస్తామని తెలిపారు.  75 వేల నుంచి లక్షా 50 వేల వరకు ప్రైమ్ లొకేషన్ ఆధారంగా ఉంటుందన్నారు.  స్టాల్స్ సైజు.. రిజిష్ట్రేషన్ ప్రకారం అద్దె వసూలు  చేయనున్నారు.  ఆసక్తిగల వ్యాపారులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగి తెలియజేశారు. 

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీ, నుమాయిష్  2024 జనవరి 1నుంచి 2024 ఫిబ్రవరి  15 వరకు ప్రజలకు ఉంటుంది.  వినియోగదారుల కోసం నుమాయిష్ మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.  తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలలో స్మార్ట్ ఫోన్లలో యాప్ స్టోర్ ల నుంచి  డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 

స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు 1938 లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.  ఉస్మానియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారి ఆలోచనల మేరకు  అప్పటి హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటిసారిగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.  ఇందులో వచ్చిన రెస్పాన్స్ ను చూసి ప్రతి ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఎగ్జిబిషన్ లో వచ్చే ఆదాయాన్ని విద్యాభివృద్దికి వినియోగించాలని నిర్ణయించారు.  అప్పట్లో 50 స్టాల్స్ తో ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ నేడు దేశంలోరి అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శరలలో ఒకటిగా నిలిచింది.