
- కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్ డిమాండ్
- ఈడీ ఆఫీసు ముందు ఆందోళన
బషీర్‌బాగ్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ టికెట్ల అమ్మకాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై దర్యాప్తు జరపాలని పార్టీ బహిష్కృత నేత డాక్టర్ కురువ విజయకుమార్ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు ముందు తన అనుచరులతో బైఠాయించి ఆందోళన చేయగా.. పోలీసులు విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమాలపై 12 రోజుల కిందట 28పేజీల ఆధారాలు సమర్పించామని, అయినా చర్యలు తీసుకోలేదన్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా, హవాలా కోణంలో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. టికెట్ల పేరిట ఒక్కొక్కరినుంచి50వేల డీడీలు తీసుకున్నారని, దీనిపై అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి శిక్షించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.