Beauty Tips : రంగుల లిప్ గ్లాస్ వద్దే వద్దు.. ఎందుకంటే..

Beauty Tips : రంగుల లిప్ గ్లాస్ వద్దే వద్దు.. ఎందుకంటే..

పెదాలకి ఎక్స్ ట్రా అందాన్ని అద్దుతుంది లిప్స్. ఆ లిప్స్ కూడా లిప్స్టిక్ లాగే బోలెడు రంగుల్లో వస్తోంది. అవి వేసుకుంటే పెదాలు మెరుస్తాయి. అయితే, అందం మాట అటుంచితే.. అవి తెచ్చే తిప్పలు అంతకు పదింతలు ఉన్నాయి. అవేంటంటే.. వాటిలో వాడే కెమికల్స్ డైజెస్టివ్ ట్రాక్ హెల్త్ ని దెబ్బతీస్తాయి. ఇదే విషయాన్ని జర్మన్ ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ మ్యాగజైన్ టెక్స్ కూడా చెబుతోంది.

లిప్ గ్లాస్ తయారీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నపిగ్మెంట్స్ లివాడతారు. వీటివల్లే లిప్స్ కలర్ వస్తుంది. అయితే ఆ పిగ్మెంట్స్ లో టైటానియన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. మినరల్ ఆయిల్, ప్లాస్టిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తాయి అంటోంది టెక్స్ మ్యాగజైన్. ఈ జర్మనీ మ్యాగజైన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని స్టడీ చేసి రివ్యూలు ఇస్తుంటుంది.

ఈ మధ్యనే యూరోపియన్ మార్కెట్ లోని డిఫరెంట్ కంపెనీలకి చెందిన 16 లిప్స్ పైరీసెర్చ్ చేసింది. అందులో సగానికి సగం ప్రొడక్ట్స్ అసలు వాడటానికి అనువైనవే కాదని తేలింది. కారణం వాటిలోని టైటానియమ్ డైఆక్సైడ్ ఈ స్టడీకి ముందే జర్మనీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ టైటానియమ్ డైఆక్సైడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది. దాంతో దీన్ని బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది యూరోపియన్ కమీషన్. అలాంటిది లిప్ గ్లాస్ నూ టైటానియమ్ డైఆక్సైడ్ పెద్ద మొత్తంలో ఉండటంతో ఆ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలని చెప్తున్నారు ఈ స్టడీ చేసిన రీసెర్చర్లు.

ఇవిస్కిన్ లోపలకి చొచ్చుకుపోతాయి అనడానికి ఆధారాలేం లేకపోయినా, లిప్ గ్లాస్ లేదా లిప్ బామ్ పెట్టుకున్నప్పుడు అవి నోట్లోకి వెళ్లడం సహజం.. అలా టైటానియమ్ డైఆక్సైడ్ డైజెస్టివ్ ట్రాక్ లోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు వాళ్లు. అలాగే లిప్ గ్లాస్లలో ఉండే అజో డైస్ అనే ఆర్గానిక్ కాంపౌండ్స్, పారాఫిన్స్, కార్సినోజెనిక్ మినరల్ ఆయిల్ కాంపౌండ్స్ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తాయంటోంది ఈ స్టడీ. అందుకే ఇక నుంచి పిగ్మెంటెడ్ లిప్స్ కి దూరంగా ఉండాల్సిందే.