పిల్లల్లో పెరుగుతున్న కరోనా.. ప్రతీ 100 కేసుల్లో 7 చిన్న పిల్లలవే

V6 Velugu Posted on Sep 14, 2021

పిల్లల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో చిన్నపిల్లలు కూడా ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన డేటాను కేంద్ర ఆరోగ్య శాఖ అనలైజ్ చేస్తోంది. పదేళ్ల లోపు పిల్లల్లో గత మార్చిలో 2.8 శాతం ఉన్న కేసులు... ఆగస్ట్ నాటికి 7.4శాతానికి పెరిగాయి. దేశంలో నమోదవుతున్న ప్రతీ 100 కేసులలో 7 చిన్నపిల్లలవే ఉంటున్నాయి. అలాగే హాస్పిటల్స్ లోనూ చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. సీరో సర్వే రిపోర్ట్స్ కూడా పిల్లల్లో కరోనా పాజిటివ్ రేట్ 57 నుంచి 58శాతంగా ఉన్నట్టు సూచిస్తున్నాయి. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగదశలో ఉన్నాయి. 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఇచ్చేందుకు జైకోడ్-D వ్యాక్సిన్ ను అప్రూవ్ చేసింది కేంద్రం. ఇది నవంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అయితే పదేళ్లలోపు వారికి ఇచ్చేందుకు భారత్ బయోటెక్, బయోలాజికల్ E, సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రయోగాలు చేస్తున్నాయి

Tagged children, increase, Experts, Covid Cases, Covid emergency strategy

Latest Videos

Subscribe Now

More News