5 వేల మంది.. 24 గంటలూ సేవలు

5 వేల మంది.. 24 గంటలూ సేవలు
  • మేడారంలో జాతరలో శానిటేషన్ పనుల నిర్వహణ 
  • డీపీవో ఆఫీసర్ నుంచి సిబ్బంది వరకు డ్యూటీలు 

తాడ్వాయి, వెలుగు: మేడారం జాతరలో మున్సిపల్, పంచాయతీరాజ్, హెల్త్ వర్కర్స్ విభాగాలకు చెందిన అధికారి నుంచి కిందిస్థాయి శానిటేషన్ కార్మికుల వరకు విధులు నిర్వహించారు. సుమారు 5 వేల మంది 24 గంటలు అందుబాటులో ఉంటూ రోడ్లు, మరుగుదొడ్లు, శానిటేషన్ సేవలు అందిస్తున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. జాతర అనంతరం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.  తెలంగాణ, ఏపీ నుంచి శానిటేషన్ వర్కర్లను మేడారానికి తీసుకొచ్చారు.

డీపీవో, డివిజనల్ పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు నిత్యం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, ఇతర ఆఫీసులు, అధికారుల నివాస ప్రాంతాలు, రోడ్ల వెంట, మరుగుదొడ్ల పరిశుభ్రత, క్లీనింగ్, బ్లీచింగ్ ప్రదేశాలలో పనులు చేస్తూ  జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. సేకరించిన చెత్తను ప్రత్యేక ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల ద్వారా తాడ్వాయి– మేడారం మధ్యనున్న సెగ్రిగేషన్ షెడ్డుకు 
తరలిస్తున్నారు.