కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంనాయక్ డిప్యుటేషన్ మరో ఏడాది పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఐఆర్‌ఎస్‌కు చెందిన బలరాంనాయక్ డిప్యుటేషన్‌పై నాలుగేండ్లు సింగరేణి డైరెక్టర్‌గా పనిచేశారు. 2024 జనవరి1 నుంచి ఇన్‌చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అయితే ఐదేండ్ల డిప్యుటేషన్ నేటితో ముగియనుంది. దీంతో ఆయన డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ సిఫార్సును ఆమోదిస్తూ డీఓపీటీ ఆర్డర్స్ జారీ చేసింది.
