ఆర్కిటెక్చరల్​ ఫొటోగ్రఫీ అవార్డ్స్​లో కళ్లను కట్టిపడేసే కట్టడాలు

ఆర్కిటెక్చరల్​ ఫొటోగ్రఫీ అవార్డ్స్​లో  కళ్లను కట్టిపడేసే కట్టడాలు

కొన్ని బిల్డింగ్స్​, బ్రిడ్జి, స్టేడియంలు చూస్తే భలే కట్టారే అనిపిస్తుంది. అలాంటి వాటిని కళ్లలో దాచుకుని వదిలేస్తే ఎలా? కెమెరా క్లిక్​తో అందమైన జ్ఞాపకంగా దాచాలి. అందుకే ఆర్కిటెక్చరల్​ ఫొటోగ్రఫీ అవార్డ్స్​ 2022 పేరిట ఒక కాంపిటీషన్​ పెట్టారు. ఈ పోటీ​లో ఏ దేశస్తులైనా పాల్గొనవచ్చు. ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​, సెన్స్​ ఆఫ్​ ప్లేస్​, బిల్డింగ్స్​ ఇన్​ యూజ్​, పోర్ట్​ ఫోలియో (ట్రాన్స్​పోర్ట్​ హబ్స్​), మొబైల్​ – బ్రిడ్జెస్ అని ఆరు కేటగిరీలు ఉంటాయి.

ఒక్కో కేటగిరీలో ఇద్దరు విన్నర్స్​ను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్​ 2వ తేదీన విన్నర్స్​ను అనౌన్స్​ చేస్తారు. ‘‘ఈ మధ్య ప్రతీ ఒక్కరూ ఫొటోగ్రాఫర్​ అయ్యారు. దాంతో చాలా మంచి ఆర్కిటెక్చరల్​ ఫొటోగ్రాఫ్స్​ వస్తున్నాయి. ఈ కాంపిటీషన్​ ద్వారా ఏడాదికి ఒకసారి ఆర్కిటెక్చర్​ డిజైన్​లో వస్తున్న మార్పుల గురించి లోతుగా అర్థం చేసుకునే వీలు కలుగుతుంద”ని ఈ​ ప్రోగ్రామ్​ డైరెక్టర్​ పౌల్​ ఫించ్​ అన్నాడు. ఈ అవార్డ్స్​ కోసం షార్ట్​ లిస్ట్​ అయిన ఫొటోల నుంచి కొన్ని..