Poonam Kaur: రణవీర్ సింగ్ ‘రియల్’.. మరి ‘ఫేక్’ ఎవరు? పూనమ్ కౌర్ పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్!

Poonam Kaur: రణవీర్ సింగ్ ‘రియల్’.. మరి ‘ఫేక్’ ఎవరు? పూనమ్ కౌర్ పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి పూనమ్ కౌర్. కేవలం వెండితెరపై కనిపించే నటనకే పరిమితం కాకుండా.. సమాజంలో జరిగే అన్యాయాలపై , ముఖ్యంగా మహిళా సమస్యలపై తన గళాన్ని నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.  ఈ క్రమంలో మరోసారి పూనమ్ హాట్ టాపిక్ గా మారారు. లేటెస్ట్ గా భాలీవుడ్ చిత్రం ధురంధర్ 2 గురించి ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరి పేరు ఎత్తకుండానే పదునైన విమర్శలు చేసింది.

అసలేం జరిగింది?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాను చూసిన పూనమ్ కౌర్, చిత్రంలోని ప్రధాన పాత్ర ‘జస్క్రిత్ సింగ్ రంగీ’ని ప్రశంసిస్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. "ది రియల్ సింగ్.. స్టోరీ ఆఫ్ రియల్ హీరో. ధురంధర్ 2 సినిమా కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను" అని రాశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, ఆమె చివర్లో జోడించిన "ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్సాఫీస్ ముందు నిలబడలేరు" అనే వ్యాఖ్యలు అసలు వివాదానికి తెరలేపాయి.

‘ఫేక్ సింగ్’ టార్గెట్ పవర్ స్టార్ వైపేనా?

పూనమ్ కౌర్ చేసిన ఈ ‘ఫేక్ సింగ్’ వ్యాఖ్యలు నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ధురంధర్ 2 విడుదలైన  రోజే  పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సయంలో పవర్ స్టార్ సిక్కు గెటప్ లో కనిపించారు. ఈ నేపథ్యంలోనే ఫేక్ సింగ్ అంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు పవన్ ను లక్ష్యంగా చేసుకున్నవేనని మెగా అభిమానులు మండిపడుతున్నారు. 

ALSO READ : ఇంట్రెస్టింగ్ కాంబో: సినిమా చరిత్రలో అరుదైన హిస్టరీ.. మొదటి హీరోతోనే డైరెక్టర్ 100వ సినిమా..

 పూనమ్ కౌర్ స్వతహాగా సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో, పవన్ కళ్యాణ్ కేవలం సినిమా కోసం ఆ గెటప్ ధరించడాన్ని ఆమె పరోక్షంగా తప్పుబట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, గతంలో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ మధ్య ఉన్న విభేదాల గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవేనని మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక గళం
2006లో ‘మాయాజాలం’తో ఎంట్రీ ఇచ్చి ‘శౌర్యం’, ‘గగనం’ వంటి సినిమాలతో మెప్పించిన పూనమ్, ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సామాజిక అంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళా సమస్యలు, చేనేత కళాకారుల హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె చేసే ఇలాంటి గూడార్థాలతో కూడిన పోస్ట్‌లు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వివాదంపై పూనమ్ కౌర్ క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నారో స్పష్టంగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయి కూర్చుంది.