తప్పిపోయిన అమెరికా యుద్ద విమానం ఆచూకీ దొరికింది..

తప్పిపోయిన అమెరికా యుద్ద విమానం ఆచూకీ దొరికింది..

అమెరికా సైన్యానికి చెందిన F-35 ఫైటర్ జెట్ గాల్లో ఉండగానే తప్పిపోయింది. తాజాగా ఇది సౌత్ కరోలినా, విలియమ్స్‌బర్గ్ కౌంటీలో క్రాష్ అయినట్లు అధికారులు కనుగొన్నారు. ఫైటర్ జెట్ క్రాష్ తర్వాత రెండు రోజుల పాటు విమానయాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెరైన్ కార్ప్స్ సెప్టెంబర్ 18న ప్రకటించింది. ఇటీవలి వారాల్లో ఇది మూడో ప్రమాదం.

అమెరికాలో ఉన్న సౌత్‌ కరోలినా రాష్ట్రంలోని బ్యూ ఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా సైన్యానికి చెందిన ఫైటర్ జెట్‌ ఎఫ్‌ 35 బయల్దేరింది. అది గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికి అందులో ఎమర్జెన్సీ ఏర్పడటంతో పైలట్ దూకేశాడు. అధికారులు అతని పేరు వెల్లడించనప్పటికీ.. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారని, అతని పరిస్థితి నిలకడగా ఉందని మెరైన్స్ మేజర్ మెలానీ సాలినాస్ తెలిపారు. ఆ తర్వాత ఆ ఫైటర్ జెట్ ఆచూకీ కనబడలేదు. కనపడకుండా పోయిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ విలువ 80 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 665 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.