ఈ స్మార్ట్ గాగుల్స్ వస్తే.. స్మార్ట్ ఫోన్లు పక్కకే..

ఈ స్మార్ట్ గాగుల్స్ వస్తే.. స్మార్ట్ ఫోన్లు పక్కకే..

స్టైలిష్‌‌ లుక్‌‌ కోసం సన్‌‌గ్లాసెస్‌‌ వాడటం కొత్తేమీ కాదు. కానీ ఈ లేటెస్ట్‌‌ స్మార్ట్‌‌ గాగుల్స్‌‌ను పెట్టుకుంటే మాత్రం దునియా మొత్తం చూసేయొచ్చు అంటోంది ఫేస్‌‌బుక్‌‌. రే బాన్‌‌ సన్‌‌ గ్లాసెస్‌‌ సంస్థతో కలిసి పార్టనర్‌‌‌‌ షిప్‌‌లో కెమెరాతో కూడిన లగ్జరీ సన్‌‌ గ్లాసెస్‌‌ను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ఫేస్​బుక్​ ప్రయత్నిస్తోంది. వాటి ధర కూడా నిర్ణయించేసింది. 40 డాలర్ల నుంచి 299 డాలర్లలోనే ఈ వర్తబుల్‌‌ గ్లాసెస్‌‌ మార్కెట్లో లభ్యమవుతాయట. డ్యూయల్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ ఐదు మెగా ఫిక్సెల్‌‌ కెమెరాలు, మూడు మైక్రోఫోన్‌‌ అర్రే, డిస్‌‌క్రీట్‌‌, ఓపెన్‌‌ ఇయర్‌‌‌‌ స్పీకర్స్‌‌ వీటి స్పెషాలిటీలు. వీటితో సీక్రెట్‌‌గా ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. అందుకు వీలుగా కొత్త యాప్‌‌లతో వీటిని డిజైన్‌‌ చేస్తున్నారు.

ఎలా ఉంటాయ్‌‌!

సాధారణ గ్లాసెస్‌‌ లైట్‌‌ వెయిట్‌‌ ఉండి.. కండ్లకు పెట్టుకుంటే తేలిగ్గా, చూసేందుకు అందంగా ఉంటాయి. కాని ఈ రే బాన్‌‌ గ్లాసెస్‌‌ అలాక్కాదు. వీటి ఫ్రేమ్‌‌ కాస్త మందంగా ఉంటుంది. చెవులను పట్టి ఉంచే ఆర్మ్స్‌‌ కొంచెం పొడవుగా ఉండి కళ్లకు తగిలించుకుంటే కాస్త వెయిట్‌‌ అనిపిస్తాయి. చాలామంది తమ గాగుల్స్‌‌ని స్టైల్‌‌గా తలపై పెట్టుకుంటారు, కాని వీటిని అలాకాకుండా రెండుగా విడదీసి పాకెట్‌‌లో పెట్టుకునేలా డిజైన్‌‌ చేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్‌‌ ఉన్న ఇవి ఎలా పనిచేస్తాయ్ అనుకుంటున్నారా! ఈ గ్లాసెస్‌‌ను చార్జింగ్‌‌ చేయాల్సిందే. అంటే యూఎస్‌‌బీసీ కేబుల్‌‌ వెంట ఉండాల్సిందే అన్నమాట. బ్లూటూత్ ద్వారా వీటిని ఎనేబుల్‌‌ చేసి స్మార్ట్‌‌ ఫోన్‌‌కి కనెక్ట్‌‌ చేయొచ్చు. స్పెషల్‌‌గా స్మార్ట్‌‌ గ్లాసెస్‌‌ కోసం డిజైన్‌‌ చేసిన ఫేస్‌‌బుక్‌‌ వ్యూ యాప్‌‌ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయి. చార్జింగ్‌‌ పూర్తైయినట్టు సిగ్నలిస్తూ చిన్న గ్రీన్‌‌ లైట్,  గ్లాసెస్‌‌ని ఆన్‌‌ చేసేందుకు లెఫ్ట్‌‌ సైడ్‌‌ ఓ బుల్లి స్విచ్‌‌ ఉంటాయి. ఫోన్‌‌ కాల్‌‌ కనెక్ట్‌‌ చేసుకునేందుకు టచ్‌‌ ప్యాడ్‌‌ ఉంటుంది. కాకపోతే ఎవరు కాల్‌‌ చేస్తున్నారో మాత్రం తెలుసుకునేందుకు వీలుండదు. అలాగే వీటితో ఇష్టమైన మ్యూజిక్‌‌ వినొచ్చు. వీడియోను క్యాప్చర్‌‌‌‌ చేస్తూ ఫేస్‌‌బుక్‌‌, ట్విట్టర్‌‌‌‌, ఇన్‌‌స్టా గ్రామ్‌‌లలో లైవ్ చూడొచ్చు. ఎదుటివారికి ఏ మాత్రం అనుమానం రాకుండా సీక్రెట్‌‌ ఆపరేషన్‌‌ వీడియోలు కూడా తీయొచ్చు. దీంతో  స్మార్ట్‌‌ ఫోన్లను కూడా పక్కన పెట్టేస్తారని, గాడ్జెట్‌‌ ప్రేమికులకు ఈ స్మార్ట్‌‌  రేబాన్‌‌ గ్లాసెస్‌‌ ఎన్నో రకాలుగా పనికి వస్తాయని అంటున్నారు.