జుకర్‌‌బర్గ్‌పై కోపంగా ఉన్న ఉద్యోగులు

జుకర్‌‌బర్గ్‌పై కోపంగా ఉన్న ఉద్యోగులు
  • 90 నిమిషాల వీడియో కాల్‌లో ఎన్నో ప్రశ్నలు
  •  ట్రంప్‌ పోస్టులపై దుమారం

కాలిఫోర్నియా: ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌‌బర్గ్‌కు సొంత ఉద్యోగుల నుంచే వ్యతిరేకత వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టుల విషయంలో ఎంప్లాయిస్‌ అంతా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కంపెనీ రెగ్యులర్‌‌గా నిర్వహించే ఆల్‌హ్యాండ్స్‌ సమావేశంలో వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. దాదాపు 90 నిమిషాలు సాగిన ఈ మీటింగ్‌లో జూకర్‌‌పై ఉద్యోగులు ఎన్నో ప్రశ్నలు కురిపించారు. ట్రంప్‌ పెట్టే కొన్ని పోస్టుల విషయంలో కంపెనీ విధానాలకు మార్క్‌ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎంప్లాయిస్‌ ఆరోపించారు. జార్జి ఫ్లాయిడ్‌ విషయంలో అమెరికా అంతటా నిరసన జ్వాలలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దోపిడీలు మొదలైతే కాల్పులు మొదలవుతాయి అని ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఎంప్లాయిస్‌ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అవి సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా లేదని మార్క్‌ ఉద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మార్క్‌ జుకర్‌‌బర్గ్‌పై ఎంప్లాయిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే కామెంట్స్‌ విషయంలో చర్యలు తీసుకుంటామని మార్క్‌ మాకు చెప్పారని, అది ఇప్పుడు తప్పని తేలిపోయిందని కొంత మంది ఆరోపించారు. తీమోతీ అవెని అనే సంస్థ ఇంజనీరు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి రాజీనామా చేశారు.