జుకెన్ బర్గ్ కేబుల్స్ లూజ్ అయినయా..

జుకెన్ బర్గ్ కేబుల్స్  లూజ్ అయినయా..

సోషల్ మీడియా సంస్థలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నిన్న చాలా సేపు పనిచేయలేదు. నిన్న రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడినా.. ఆ తర్వాత మాత్రం నవ్వులు పూయిస్తున్నారు. ట్విట్టర్ తో పాటు.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మీమ్స్ తో ఫన్ క్రియేట్ చేస్తున్నారు. జుకెన్ బర్గ్ కేబుల్స్ సరి చేస్తున్నారంటూ ఒకరు.. సైట్లు ఏవీ పనిచేయకపోవడంతో తలపట్టుకున్నారంటూ మరొకరు మీమ్స్ పోస్ట్ చేశారు. ఇక.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నిలిచిపోవడంతో యూత్ అంతా ట్విట్టర్ కు క్యూ కట్టారంటూ వీడియోలు పోస్ట్ చేశారు.