ఫేస్‌ బుక్‌ ఫొటోలు.. గూగుల్‌ లో

ఫేస్‌ బుక్‌ ఫొటోలు.. గూగుల్‌ లో

మొబైల్‌ ఫోన్‌ లో గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వీడియోలు మాత్రమే ‘గూగుల్‌ ఫొటోస్‌ ’ యాప్‌ లో సేవ్‌ అవుతుంటాయి. ఫేస్‌ బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో యాప్స్‌ లో ఉన్న ఫొటోలు, వీడియోలు డైరెక్ట్‌ గా గూగుల్‌ ఫొటోస్‌ లో సేవ్‌ అయ్యే అవకాశం లేదు. కానీ, త్వరలో ‘ఫేస్‌ బుక్‌ ’ ఇలాంటి అవకాశాన్ని కల్పించనుంది. ‘ఫేస్‌ బుక్‌ ’లో పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలు ‘గూగుల్‌ ఫొటోస్‌ ’లో డైరెక్ట్‌ గా సేవ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ను ఫేస్‌ బుక్‌ డెవలప్‌ చేస్తోంది. ముందుగా ‌ఐర్లాండ్ లో ఇది అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాది ఈ ఫీచర్‌ ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుందని ఫేస్‌ బుక్‌ తెలిపింది. అయితే డాటా ట్రాన్స్‌ ఫర్‌ చేయాలంటే ముందుగా పాస్‌ వర్డ్‌ అథెంటికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.