స్టార్ గుర్తు ఉన్న రూ. 500 చెల్లుబాటవుతుందా?.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

స్టార్ గుర్తు ఉన్న రూ. 500 చెల్లుబాటవుతుందా?.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

రూ.2వేల కరెన్సీ నోట్లు మరి కొద్ది రోజుల్లో కనుమరుగు కానున్న క్రమంలో దేశంలో రూ.500 నోట్ల హవా నడుస్తోంది. ఈ తరుణంలోనే మార్కెట్‌లో చలామణిలో ఉన్న కొన్ని కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రూ. 500తో పాటు ఇతర డినామినేషన్ల నోట్లపైనా కుడివైపు కింది భాగంలో ముద్రించి ఉండే సిరీస్ నంబర్ల మధ్యలో ఈ స్టార్ గుర్తు కనిపిస్తోంది. అలాంటి నోట్లు- నకిలీవనే ప్రచారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై జోరుగా సాగుతోంది. అవి ఫేక్ నోట్లు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్లపై స్టార్ గుర్తు కనిపించడం అసాధారణమే. ఇలాంటి సింబల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన సందర్భాలు లేవు. ఇలాంటి ఎక్స్‌ట్రా సింబల్స్‌ను నోట్లపై ప్రింట్ చేయడానికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతంలో పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు.

ఈ ఆందోళనపై తాజాగా ఆర్బీఐ స్పందించింది. ఈ మధ్యకాలంలో సిరీస్ నంబర్ల వద్ద స్టార్ గుర్తు కనిపించడం సాధారణంగా మారడంపై పలు వ్యాఖ్యలు చేసింది. అవి నకిలీ నోట్లనే అనుమానంపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని మొత్తానికి తేల్చి చెప్పింది. అవి చెల్లుబాటు అవుతాయనీ స్పష్టం చేసింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది. నంబరింగ్ ప్యానెల్‌లో, ప్రిఫిక్స్, క్రమ సంఖ్య మధ్య స్టార్ గుర్తు ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. స్టార్ సింబల్ ఉంటే ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని సూచించింది. పాత నోటును రీప్లేస్ చేయడమో లేక రీప్రింట్ చేసినప్పుడు దానికి గుర్తుగా ఈ స్టార్‌ను వినియోగిస్తోన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది.

AsloRead:శాంసన్ జెర్సీతో గ్రౌండ్ లోకి సూర్య.. ఎందుకిలా.. ఏమైంది?

లోపభూయిష్టంగా ఉండటం వల్ల గతంలో జారీ చేసిన వంద బ్యాంక్ నోట్ల కట్టలను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. ఆ సందర్భంగా ఈ స్టార్‌ గుర్తును నంబరింగ్ ప్యానెల్‌లో జత చేయాల్సి వచ్చిందని పేర్కొంది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్ల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

 

कहीं आपके पास भी तो नहीं है स्टार चिह्न (*) वाला नोट❓

कहीं ये नकली तो नहीं❓

घबराइए नहीं ‼️#PIBFactCheck

✔️ ऐसे नोट को नकली बताने वाले मैसेज फर्जी है।

✔️ @RBI द्वारा दिसंबर 2016 से नए ₹500 बैंक नोटों में स्टार चिह्न (*) की शुरुआत की गई थी

?https://t.co/2stHgQNyje pic.twitter.com/bScWT1x4P5

— PIB Fact Check (@PIBFactCheck) July 26, 2023