Faf Du plessis: ధోనీ వ్యూహాలు అద్భుతం.. ఫాఫ్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు

Faf Du plessis: ధోనీ వ్యూహాలు అద్భుతం.. ఫాఫ్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ కెప్టెన్సీ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవని, అతని కెప్టెన్సీలో ఆడటం తనకు సంతృప్తినిచ్చిందని అన్నాడు. ఆర్సీబీ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన డుప్లెసిస్ ధోనీ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ లీడర్. అతనిలా అవ్వాలని చాలా ప్రయత్నించా. సీఎస్ కేలో ఆడే అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. మ్యాచ్ పై అతనికుండే అవగాహన, వాటిని అర్థం చేసుకొని వ్యూహాలు రచించే విధానం, ఉన్న కొన్ని వనరుల్ని ఎలా వినియోగించుకోవాలని, ఒత్తడిని ఎలా అదిగమించాలని ధోని నుంచి నేర్చుకున్నాన’ని డుప్లెసిస్ అన్నాడు.