ఫహాద్ ఫాజిల్ తో అపర్ణ

ఫహాద్ ఫాజిల్ తో అపర్ణ

అపర్ణ బాలమురళి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసి చాలా కాలమే అయ్యింది. కానీ ‘ఆకాశమే నీ హద్దురా’తోనే తెలుగువారికి తెలిసింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆత్మ విశ్వాసం గల అమ్మాయిగా అపర్ణ నటనకు అందరూ ఫిదా అయిపో యారు. నేషనల్ అవార్డు సైతం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. నిన్ననే అవార్డ్ అందుకుంది కూడా. దీంతో అపర్ణ పేరు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇటీవల కెరీర్‌‌ లోనూ చాలా బిజీ అయిపోయిందామె. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘సుందరి గార్డెన్స్’ సినిమాతో వచ్చిన అపర్ణ, ప్రస్తుతం ఆరు సినిమాల్లో  నటిస్తోంది. ఇప్పుడు మరో కొత్త సినిమాకి కమిటైంది. అది కూడా మామూలు సినిమా కాదు. ఫహాద్ ఫాజిల్ హీరోగా పవన్ కుమార్ దర్శకత్వంలో ‘కేజీయఫ్’ ఫేమ్ విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘ధూమమ్’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా కనిపించనుంది అపర్ణ. నిన్ననే ఈ ప్యాన్ ఇండియా మూవీని  అనౌన్స్ చేశారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 నుంచి షూటింగ్ మొదలౌ తుంది. వచ్చే యేడు వేసవిలో సినిమా విడుదలవు తుంది. ఫహాద్ లాంటి గొప్ప నటుడితో, హోంబలే ఫిల్మ్స్ లాంటి గొప్ప బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేయడం..ప్యాన్ ఇండియా సినిమా కావడం అపర్ణకి కలిసొచ్చే అంశమే. మొత్తానికి ఆమె స్పీడు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదనిపిస్తోంది.