
సినిమాల విషయంలో ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది.చాలా మంది థియేటర్స్ లో విడుదలైన సినిమాకు హిట్ టాక్ వస్తేనే ఎక్కడివరకు వెళ్లి చూస్తున్నారు.లేకపోతే ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు.అందుకే ఓటీటీలకు ప్రేక్షకుల్లో డిమాండ్ బాగా పెరిగింది.
అందుకు కారణం లేకపోలేదు..చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కంటెంట్ ను మేకర్స్ తీసుకొస్తున్నారు.ముఖ్యంగా క్రైమ్,థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ,సైకలాజికల్,రూరల్ డ్రామా..ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఓటీటీ అనేలా ఉంది.
తాజా విషయానికి వస్తే..ఇపుడు ఓటీటీలోకి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రానుంది.మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్( Fahadh Faasil), అపర్ణ బాలమురళి నటించిన మూవీ 'ధూమం'(Dhoomam). ఈ సినిమా ప్రముఖ తెలుగు ప్లాట్‍ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జూలై 11న ధూమం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.“ఎంతో గ్రిప్పింగ్‍గా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని ఊహించని రైడ్‍లోకి తీసుకెళుతుంది.జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియర్ కానుంది”అంటూ ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫహద్ ఫాజిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ (Pawan kumar)తెరకెక్కించాడు.కెజీఎఫ్(KGF), కాంతారా(Kantara) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన హోంబలే ఫిలిమ్స్(Hombale filans) ఈ సినిమాను నిర్మించింది.
నిజానికి పవన్ కుమార్ ఇలాంటి థ్రిల్లగ్ కథలు తీయడం కొత్తేమి కాదు.ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన యూ టర్న్,కుడి ఎడమైతే సినిమాలు కూడా మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఈ సినిమాలు చూసిన ఆడియన్స్ కూడా అనెక్స్పెక్టెడ్ థ్రిల్ ను ఫీల్ అయ్యారు.ఇప్పుడు మరోసారి అంతకు మించి థ్రిల్ ను పంచేందుకు సిద్దమయ్యాడు పవన్.చూసి థ్రిల్ అవ్వండి.
అయితే,ధూమం సినిమా ఇటీవలే యూట్యూబ్‍లో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మే 31న మలయాళం,కన్నడ భాషల్లో యూట్యూబ్‍లో అడుగుపెట్టింది.ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది. మరి తెలుగు ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకునుందో చూడాలి.
A gripping suspense-thriller that takes you on an unpredictable ride!#Dhoomam Premieres July 11th only on aha!#Kannada #cinema #FahadhFaasil #dhoomam @hombalefilms pic.twitter.com/iSPR0Xmyn1
— ahavideoin (@ahavideoIN) July 6, 2024