
ముజఫర్ పూర్ (బిహార్): పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఒక డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి లైసెన్స్ డ్ తుపాకీతో ఇంట్లో కాల్చుకుని చనిపోయాడు. శుక్రవారం (సెప్టెంబర్ 05) రాత్రి బిహార్ ముజఫర్ పూర్ జిల్లాలోని కాజీ మహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైత్‌పూర్ సతే కాలనీలో ఈ ఘటన జరిగింది.
మృతుడిని అశుతోశ్ చంద్రగా పోలీసులు గుర్తించారు. అశుతోశ్ ముజఫర్ పూర్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అశుతోశ్.. అమ్మ, అమ్మమ్మలతో కలిసి భోజనం చేశాడు. అనంతరం చదువుకోవడానికి మూడో అంతస్తులోని తన గదికి వెళ్లాడు.
అక్కడే తనను తాను కాల్చుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అశుతోశ్మంచం మీద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.