సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లాపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని ఆరోపించారు. జగిత్యాల జిల్లాకు ఎలాంటి వరాల కురిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని కోరారు. నిజాం షుగర్  ఫ్యాక్టరీ తెరవడం చెరుకు రైతుల కల అని గుర్తు చేశారు. 

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వడ్డలింగాపూర్, అల్లీపూర్ ను మండలాలుగా ప్రకటించాలన్నారు. జిల్లాలోని గ్రామ సర్పంచులకు ప్రతి గ్రామానికి రూ.10 లక్షల నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.