HCA లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం..ముగ్గురు క్రికెట్ ప్లేయర్లపై కేసు

HCA లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం..ముగ్గురు క్రికెట్ ప్లేయర్లపై కేసు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పలువురు క్రికెటర్లు నకిలీ సర్టిఫికెట్లతో అండర్ 19, అండర్ 23 మ్యాచ్ లు ఆడినట్లు గుర్తించారు. ఇదే విషయమై సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు  HCAలేఖ రాసింది. ప్లేయర్స్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లను పోలీసులకు అందించారు.

Also Read :- ఉప్పల్ స్టేడియంలోHCA ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దర్యాప్తు చేసిన పోలీసులు అవి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు అని నిర్ధారించారు. వయస్సును తప్పుగా చూపించి అండర్ 19, అండర్ 23 మ్యాచ్ లు ఆడినట్లు గుర్తించారు.  దీంతో ఉప్పల్ పీఎస్ లో HCA సీఈవో సునీల్ ఫిర్యాదు చేయడంతో ముగ్గురు ఆటగాళ్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన AMHO లపైనా కేస్ నమోదు చేశారు.